- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 రోజులకు చేరిన భూ పోరాటం
by Taduka Kalyani |
నాదర్ గుల్ సర్వేనెంబర్ 613/119 కాసు బాగ్ రైతుల భూ పోరాటం వంద రోజులకు చేరుకుంది. వంటా-వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం రైతులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

X
దిశ,బడంగ్ పేట్ : నాదర్ గుల్ సర్వేనెంబర్ 613/119 కాసు బాగ్ రైతుల భూ పోరాటం వంద రోజులకు చేరుకుంది. వంటా-వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం రైతులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ న్యాయం చేయకుండా రైతులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో తమ భూములు ప్రభుత్వ భూములుగా 20 ఎ నిషేధిత జాబితాలో నమోదు ఉండడం తో పాటు సుప్రీంకోర్టులో సీలింగ్ కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ తమ న్యాయం జరగడం లేదని మనోవేదన వ్యక్తం చేశారు.ఎంతమంది నాయకుల,అధికార చుట్టూ తిరుగుతున్న రైతుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ నిరసనను ప్రభుత్వానికి తెలియడానికి అనేక రకాలుగా తీసుకెళుతున్నామని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు తెలిపారు.
Next Story






