కొడంగల్‌కు ‘డబుల్’ బూస్ట్ : నేషనల్ హైవేల హబ్‌గా నియోజకవర్గం !

by Batti.Sumithra |

ఒకప్పుడు రవాణా కష్టాలతో సతమతమైన కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు జాతీయ రహదారుల కూడలిగా (Junction Hub) మారుతోంది.

కొడంగల్‌కు ‘డబుల్’ బూస్ట్ : నేషనల్ హైవేల హబ్‌గా నియోజకవర్గం !
X

దిశ, కొడంగల్ : ఒకప్పుడు రవాణా కష్టాలతో సతమతమైన కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు జాతీయ రహదారుల కూడలిగా (Junction Hub) మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ వేగంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో కొడంగల్ పట్టణానికి రెండు వైపులా జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతుండటంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే కాదు.. కొడంగల్ భవిష్యత్తును మార్చే 'ఎకనామిక్ గేట్‌వే' అని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ - బీజాపూర్ కనెక్టివిటీకి 'బైపాస్' బలం !

గతంలో ప్రధాని మోదీ NH-163 (హైదరాబాద్ - బీజాపూర్) మార్గాన్ని జాతికి అంకితం చేయడంతో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టింది. అయితే, కొడంగల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా 'బైపాస్' అవసరం ఏర్పడింది. వార్షిక ప్రణాళికలో చోటు : 2026-27 యాన్యువల్ ప్లాన్‌లో భాగంగా NH-163 కొడంగల్ బైపాస్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. తదుపరి అడుగు కేంద్రం నుంచి సాంకేతిక అనుమతులు రాగానే యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్ (DPR) తయారీ, టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది.

NH-167N: 70 శాతం పూర్తి.. ఆరు నెలల్లో విముక్తి !

భూత్పూర్ - చించోలి (NH-167N) పనులు ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్‌కు చేరుకున్నాయి. నేషనల్ హైవే డీఈఈ (NH DEE) నరేందర్ పర్యవేక్షణలో పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. రోడ్డు తుది రూపు సంతరించుకుంది.

డెడ్ లైన్.. మిగిలిన 30 శాతం పనులను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొడంగల్‌ పట్టణానికి కొత్త కళ.. మృత్యుపాశం నుంచి విముక్తి !

ఈ రెండు హైవేలు అందుబాటులోకి వస్తే కొడంగల్ పట్టణ రూపురేఖలు అంతర్జాతీయ స్థాయిలో మారనున్నాయి.

ట్రాఫిక్ ఫ్రీ సిటీ...!

భారీ వాహనాలు, కంటైనర్లు పట్టణం బయట నుంచే వెళ్తాయి. దీనివల్ల పట్టణంలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు పూర్తిగా అరికట్టబడతాయి. అంతర్జాతీయ హంగుల అద్దం లాంటి బీటీ రోడ్లు, జిగేల్మనే సెంట్రల్ లైటింగ్, రేడియం మార్కింగ్స్‌తో హైవేలు మెరిసిపోనున్నాయి.

రియల్ ఎస్టేట్ బూమ్ : రెండు జాతీయ రహదారులు కలిసే జంక్షన్ కావడంతో, ఇక్కడ వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా స్థానికులకు ఉపాధి పెరగనుంది.

అధికారుల మాట.. నరేందర్, NH DEE, కొడంగల్

"ముఖ్యమంత్రి ప్రత్యేక నిఘా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. కొడంగల్ బైపాస్ పనులు పూర్తయితే ఈ ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి.

Next Story