- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు రక్ష : కాలే యాదయ్య
దిశ, మొయినాబాద్ : కేసీఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు రక్ష అని కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం, సురంగల్, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కార్యకర్తలు నాయకులు డప్పు వాయిద్యాలతో మహిళల కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, ఆత్మహత్యలు ఉండేవని కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు.
కాళేశ్వరం కట్టి లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం రైతు బీమా పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచడం జరుగుతుందని, 400 కి గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుండగా మళ్లీ అధికారంలోకి వస్తే పదిహేను లక్షల వరకు అందిస్తున్నట్లు కేసిఆర్ మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అలాగే ఉండాలి అంటే నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం జయవంత్, జడ్పిటిసి కాలేజ్ శ్రీకాంత్, సీనియర్ నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న సతీష్, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పెద్ద మంగళవారం సర్పంచ్ నరువత్తం రెడ్డి, సురంగల్ సర్పంచ్ లావణ్య అంజిరెడ్డి, కేతిరెడ్డిపల్లి సర్పంచ్ శోభ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రహ్యూప్, మండల నాయకులు సుధాకర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.