- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

దిశ, షాద్ నగర్ : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా అందజేస్తామని తెలిపారు. అల్వాల గ్రామానికి 40 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరీ చేయడం జరిగిందని, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల నిధులతో మహిళా సమాఖ్య భవనం, రూ. 12 లక్షల నిధులతో చేపట్టనున్న అంగన్వాడి భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, వీరేష్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం
కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, మహిళా సమాఖ్య భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని, రూ. 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందని తెలిపారు. త్వరలో పాటిగడ్డ గ్రామ బ్రిడ్జిను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాటిగడ్డ గ్రామ సర్పంచ్ అఖిల్ రెడ్డి, కొత్తపేట గ్రామ సర్పంచ్ జగదీష్, కొండారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ పాల్గొన్నారు.






