మొయినాబాద్ కి క‌ల్వ‌కుంట్ల క‌విత రాక

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను మొయినాబాద్ మండలంలో విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకుడు బేగరి రాజు పిలుపునిచ్చారు.

మొయినాబాద్ కి క‌ల్వ‌కుంట్ల క‌విత రాక
X

దిశ, మొయినాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను మొయినాబాద్ మండలంలో విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకుడు బేగరి రాజు పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, ఆచార్య జయశంకర్ ఆశయాలతో పార్టీ స్థాపించబడిందని తెలిపారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ మొయినాబాద్‌కు రానున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొదటగా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు, 10 గంటలకు మొయినాబాద్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. అనంతరం సురంగల్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు గాండ్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నూతన బస్టాండ్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

Next Story