అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చూడాలి

by Ratna Kumari |

అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చూడాలి
X

దిశ‌, శంక‌ర్ ప‌ల్లి : అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి మండలంలోని అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో 99 రోజుల ప్రోగ్రాం అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డిమాండ్ రిజిస్టర్ న్యూ అసెస్మెంట్ మరియు అసెస్మెంట్ ఎక్స్ టెన్ష‌న్ రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

శానిటేషన్ కార్యక్రమాలను మెరుగుపరచాలని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. మ‌హాత్మ‌ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని స్థలాలలో తాగునీరు మెడికల్ కిట్టు ఆర్ ఎస్ వంటి ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా కూలీలకు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన పనులు గుర్తించి వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి గిరిరాజ్ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Next Story