కబ్జాను తొలగించిన ఇరిగేషన్ అధికారులు

by Jakkula.Mamatha |

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సాగర్ రహదారిపై గల ఇబ్రహీం భాష దర్గా వెనుక కాలువను కొంతమంది కబ్జా చేయడంతో స్థానికులు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కబ్జాను తొలగించిన ఇరిగేషన్ అధికారులు
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సాగర్ రహదారిపై గల ఇబ్రహీం భాష దర్గా వెనుక కాలువను కొంతమంది కబ్జా చేయడంతో స్థానికులు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కబ్జాకు గురైన కాలువపై ఇరిగేషన్ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. కబ్జా చేసిన కాలువల నుంచి పైపులు తీసివేసి కాలువలు పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. చెరువులు కాలువలు ఎలాంటి కబ్జాకు గురైన సహించబోమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కబ్జాకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.

Next Story