బీజేపీ నిర్ణయం పై ఆసక్తి

by Ratna Kumari |

ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి తల్లోజు ఆచారి కోరారు.

బీజేపీ నిర్ణయం పై ఆసక్తి
X

దిశ‌, ఆమ‌న‌గ‌ల్ : ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆమనగల్ కేంద్రంలో రిజిస్ట్రేషన్, ఆర్డిఓ, కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి ఆమనగల్ లో బీజేపీ పోటికి దూరంగా ఉంటుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి తల్లోజు ఆచారి ప్రకటించారు. ఈ ప్రకటనతో కల్వకుర్తి ఆమనగల్ లో బీజేపీ పోటీలో ఉంటుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి జిల్లా ఏర్పాటుపై స్పష్టత ఇచ్చి, ఆమనగల్లులో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చి బీజేపీకి షాక్ ఇవ్వనుందా అని ప్రజల చర్చించుకుంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి పురపాలికలో బిఆర్ఎస్, ఆమనగల్లు మున్సిపాలిటీలో బిజెపి పాలకవర్గం ఏర్పడింది.

నేడు ముఖ్యమంత్రిని కలవనున్న అఖిలపక్షం

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రానికి చెందిన దివంగత జైపాల్ రెడ్డి 84వ జయంతి రేపు మాడుగుల కేంద్రంలో నిర్వహించనున్నారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం అఖిలపక్షం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కల్వకుర్తి ని జిల్లాగా ప్రకటించాలని, ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరనున్నారు. రేపటి ఈ భేటీ పై సర్వత్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Next Story