- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
అంతర్‌రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా ముఠాపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కీలక విజయం సాధించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 51 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: అంతర్‌రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా ముఠాపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కీలక విజయం సాధించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 51 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, గంజాయిని మహీంద్రా బొలెరో వాహనం (నంబర్: OD10 C 5377)లో హైదరాబాద్‌కు విక్రయాల కోసం తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం చర్యలు చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారిక మధ్యవర్తులు, క్లూస్ టీం సహకారంతో ప్రత్యేక పోలీసు బృందం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని తారక కన్వెన్షన్ హాల్ సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న అనుమానాస్పద బొలెరో వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేయగా, వాహనం మధ్య సీటు కింద దాచిన 25 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని తూకం వేయగా మొత్తం 51.8 కిలోల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి స్వీకరించాల్సిన వ్యక్తులతో పాటు ఈ అంతర్‌రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠాలో ఉన్న ఇతర నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. క్లూస్ టీం సహకారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని పోలీసులు తెలిపారు.






