- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ ఖతమే : అంజయ్య యాదవ్
మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ ఖతమే మళ్లీ పాత కథే అవుతుందని షాద్ నగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు.

దిశ, షాద్ నగర్ : మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ ఖతమే మళ్లీ పాత కథే అవుతుందని షాద్ నగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు.కేశంపెట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్, బీజేపీలది అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ఆభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వనికే పట్టం కట్టాలని ఆయన కోరారు.






