- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామిడి సీజన్ లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు
మామిడి పండ్ల సీజన్ లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, ఇబ్రహీంపట్నం : మామిడి పండ్ల సీజన్ లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాటసింగారం పండ్ల మార్కెట్ ను చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, పాలకవర్గం సందర్శించి, మామిడి క్రయ, విక్రయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది ఒక లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగిందన్నారు. ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మామిడి సీజన్ సందర్భంగా రైతులకు వ్యాపారులకు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తుందని అన్నారు. అధిక కమీషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసిన, వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పండ్లను పండడానికి ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) అనుమతించిన ఇతనాల్ నే ఉపయోగించాలని దానిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించిన క్రిమినల్ కేసులు నమోదు చేపిస్తామని తెలిపారు. ప్రతి వారం మా పాలకవర్గం తిరిగి పరిశీలిస్తామని అన్నారు. ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి.హెచ్ భాస్కర చారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, మచ్చెందర్ రెడ్డి, గణేశ్ నాయక్, నరసింహ, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతో పాటు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్ పాల్గొన్నారు.






