‘విగ్రహ ప్రతిష్టాపనలు పూర్వజన్మ సుకృతం’: ఎమ్మెల్యే

by Kodari Anjali |

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ తుల్జా భవాని విగ్రహ స్థాపనకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘విగ్రహ ప్రతిష్టాపనలు పూర్వజన్మ సుకృతం’: ఎమ్మెల్యే
X

దిశ, తలకొండపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ తుల్జా భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం పూర్వజన్మలో చేసుకున్న శుకృతమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కర్కాస్ తండాలో శుక్రవారం స్థానిక సర్పంచ్ అనిత శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వేరువేరుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ దేవాలయాల పునరుద్ధరణ చేయడం వల్ల ప్రజల మధ్య స్నేహభావం పెరిగి ఈర్ష ద్వేషాలు తొలగిపోతాయని, దైవభక్తి పెరుగుతుందని ఆయన అన్నారు.

అమ్మవారి ఆశీస్సులు గిరిజనులపై ఎల్లప్పుడు ఉండాలి..

అదేవిధంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం 2.60 లక్షల రూపాయలను విరాళంగా అందించి ఆలయ నిర్మాణంలో భాగ్యస్వాములయ్యారు. ఆలయ నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, గిరిజనులందరూ ఒక్కతాటిపై ఉంటూ స్నేహభావంతో కలిసి మెలిసి ఉండాలని రాఘవేందర్ రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అమ్మవారి ఆశీస్సులు గిరిజనులపై ఎల్లప్పుడు ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నేతలను ఘనంగా శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జర్నల్ సెక్రటరీ రాజేంద్రనాయక్, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, శంకర్ నాయక్,ఉప సర్పంచ్ గోపాల్ నాయక్, నాయకులు గణేష్ గుప్తా, నరసింహారెడ్డి, మల్లేష్, పాండు, సంతోష్, రవి, దేవేందర్, బాలకోటి, నారియా, సంతోష్, దేవేందర్, పంతు, తదితరులు పాల్గొన్నారు.

Next Story