- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐస్ క్రీమ్ తయారీ గుట్టు రట్టు..
by Taduka Kalyani |
మండల పరిధిలోని రాంచంద్రాపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఐస్ క్రీం కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

X
దిశ, కొందుర్గు: మండల పరిధిలోని రాంచంద్రాపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఐస్ క్రీం కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంచంద్రాపురం గ్రామంలో అనుమతులు లేకుండా ఐస్ క్రీం కంపెనీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసిన పోలీసులు పర్వతపూర్ కు చెందిన మహమ్మద్ అజీమ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అక్కడ కలుషితమైన నీరు, పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐస్ క్రీంల తయారీకి ఉపయోగిస్తున్న చార్నెల్ మిషన్, ఐస్ క్రీం బాక్స్ లు, బజాజ్ సిటీ, టీవీఎస్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






