నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు

by velandi.Saikiran |

తనను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని, మున్సిపల్ 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అన్నారు.

నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు
X

దిశ, ఇబ్రహీంపట్నం : తనను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని, ఆరోగ్యం సహకరించకనే సోమవారం మున్సిపల్ కార్యాలయానికి రాలేకపోయానని ఇబ్రహీంపట్నం మున్సిపల్ 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో సోమవారం ఆయన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గైజరయ్యారు. దింతో ఆకుల యాదగిరి కిడ్నాప్ న‌కు గురైయారని ఆయన కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వాయిదా పడింది.

ఆయన మంగళవారం బీఆర్ఎస్ కౌన్సిలర్ల తో పాటు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆకుల యాదగిరి మాట్లాడుతూ.. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని, నా ఆరోగ్యం సరిగా లేక రాలేకపోయానని తెలిపారు. నన్ను చైర్మన్ ఎన్నిక కోసం ఎవరు బలవంతం చేయలేదన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని, మున్సిపల్ చైర్మన్ కోసం బీఆర్ఎస్ అభ్యర్థికే తన మద్దతు తెలుపుతానని పేర్కొన్నారు. అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా అధైర్య పడొద్దని వెల్ల‌డించారు. నేను క్షేమంగా ఉన్నానని తెలిపారు. కోర్టులో కూడా బుధవారం ఇదే విషయం చెప్తానని ఆకుల యాదగిరి పేర్కొన్నారు.

Next Story