- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగంలోకి దిగిన ‘హైడ్రా’.. 2,100 గజాల పార్క్ స్థలానికి మోక్షం
ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా దూసుకుపోతున్న హైడ్రా (HYDRAA), తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో భారీ ఆక్రమణను తొలగించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా దూసుకుపోతున్న హైడ్రా (HYDRAA), తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో భారీ ఆక్రమణను తొలగించింది. బాలాపూర్ (Balapur) మండలం మీర్‌పేట్ (Meerpet) మున్సిపాలిటీ పరిధిలోని నంది హిల్స్ కాలనీలో సుమారు 2,100 గజాల పార్కు స్థలాన్ని అధికారులు ఆక్రమణదారుల నుంచి విముక్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. నంది హిల్స్ కాలనీలో ప్రజల వినియోగం కోసం కేటాయించిన పార్కు స్థలంపై కొందరు రాజకీయ నాయకులు కన్నేశారు. సుమారు 2100 గజాల విస్తీర్ణం కలిగిన ఈ ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసి, అక్రమంగా లేఅవుట్లు వేశారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మున్సిపల్ అధికారులు గతంలో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు, చివరకు ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఆదేశాల మేరకు, అధికారులు క్షేత్రస్థాయిలో లోతైన విచారణ జరిపారు. రెవెన్యూ మున్సిపల్ రికార్డులను పరిశీలించగా, అది నిస్సందేహంగా పార్కుకు కేటాయించిన స్థలమేనని తేలింది.
భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
నిజానిజాలు నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు, పోలీసుల సహకారంతో నంది హిల్స్ కాలనీకి చేరుకున్నారు. పార్కు స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలు, షెడ్లు మరియు ఇతర నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో నేలమట్టం చేశారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. త్వరలోనే అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు కూడా పెట్టనున్నట్లుగా అధికారులు తెలిపారు.






