శ్రీఆదిత్య వింటేజ్‌ కట్టడాలపై హైడ్రా ఫోకస్

by Malleboina Mahesh |

నార్సింగి మున్సిపల్ పరిధిలో మూసీ పక్కన నిర్మిస్తోన్న శ్రీఆదిత్య వింటేజ్‌పై హైడ్రా అధికారులు దృష్టి సారించారు.

శ్రీఆదిత్య వింటేజ్‌ కట్టడాలపై హైడ్రా ఫోకస్
X

దిశ, గండిపేట: నార్సింగి మున్సిపల్ పరిధిలో మూసీ పక్కన నిర్మిస్తోన్న శ్రీఆదిత్య వింటేజ్‌ (Sri Aditya Vintage)పై హైడ్రా అధికారులు (Hydra officers) దృష్టి సారించారు. మూసీ నది బఫర్‌జోన్‌లో సదరు నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గండిపేట జలాశయం గేట్లు ఎత్తడంతో వరద నీరంతా శ్రీఆదిత్య ప్రాజెక్టు నిర్మాణంలోకి చేరింది. మూసీ పక్కనే నిర్మిస్తున్న ఈ భవనంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు.. అధికారులను ప్రశ్నించారు.

వాస్తవాలు తెలుసుకునేందుకు హైడ్రాతో పాటు హెచ్‌జీసీఎల్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం అక్కడికి చేరుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం వస్తున్నారని సమాచారం అందజేశారు. కోర్టు కేసు ఉండటంతో రంగనాథ్ నార్సింగి పర్యటన క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఆయా శాఖల అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోసారి సందర్శించి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని ఆఫీసర్లు వెల్లడించారు.

Next Story