- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్రంగూడ భూములపై హైడ్రా గురి!
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన హైడ్రా.. చెరువులు, పార్కులు, లేఅవుట్ పరిరక్షణలోనే కాదు.. ఇప్పుడు వ్యవసాయ భూములపై కూడా గురి పెట్టింది.

దిశ, బడంగ్ పేట్: జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన హైడ్రా.. చెరువులు, పార్కులు, లేఅవుట్ పరిరక్షణలోనే కాదు.. ఇప్పుడు వ్యవసాయ భూములపై కూడా గురి పెట్టింది. గుర్రంగూడ పరిధిలోని రైతుల ఆధీనంలో ఉన్న 117 ఎకరాల అసైన్డ్ భూమి పై దృష్టి సారించినట్లు తెలు స్తోంది. 50-60 సంవత్సరా ల క్రితం నుంచి రైతుల అధీ నంలో ఉండి, రికార్డులకెక్కని అసైన్డ్ భూములను మళ్లీ స్వా ధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలు స్తుంది. ఇటీవలే హైడ్రా అధికారులు రానున్న 10 రోజు ల్లో భూములను ఖాళీ చేసేం దుకు ఒక నిర్ణయానికి రావా లని మౌఖికంగా ఆదేశించిన ట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సందర్భంలో అసైన్డ్ రైతు లు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కలెక్టర్ ను కలిశారు.
గుర్రంగూడ గ్రామపంచాయతీ పరదిలోని సర్వే నెం. 92/17, 92/24లో సుమారు 117 ఎక రాల భూమి ఉంది. కాగా.. గత 50, 60 ఏళ్ల క్రితం గ్రామ రైతు లు ఈ భూములను సాగు చేసుకుంటుండగా.. అప్పటి ప్రభుత్వం కొందరు రైతులకు అసైన్డ్ పట్టాలిచ్చింది. ఐతే అదే సమీపంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి ప్రభుత్వం స్థలం కేటాయించడంతో ఆ సమీప ప్రాంతా ల్లోని ప్రైవేట్ వెంచర్లకు సైతం కొన్ని నిబంధనల మేరకే అనుమతులు ఇవ్వగా, 92/17, 92/ 24లో కూడా రైతులకు పాస్ పు స్తకాలు ఇవ్వకుండా కేవలం అర్హ త పత్రాలిచ్చి సాగు చేసుకోవాలన్నారు. దీంతో అప్పటి నుంచి వా రసత్వంగా రైతులు ఆ అసైన్డ్ భూమి ఆధీనంలో ఉన్నారు. తా జాగా హైడ్రా పేరుతో పలువురు 10 రోజుల గడువులో భూముల అధీనం నుంచి వెళ్లిపోవాలని ఆ దేశిస్తున్నారని, ఫోన్లు చేస్తున్నార ని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రైతులు శుక్రవారం ఎమ్మె ల్యేను కలిసి వివరించారు.
టీఆర్ఎస్ హయాంలో..
గత ప్రభుత్వ హయాంలో ఈ అసై న్డ్ భూముల్లో ప్రభుత్వం హెచ్ఎం డీఏ లేఅవుట్ చేయాలని భావిం చింది. దీనికి రైతులతో రాజకీ య, అధికారిక చర్చలు జరిగా యి. హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి భూములు కోల్పోతున్న రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు. చివర కు 60 గజాల లేఅవుట్ చేయడం తో రైతుల నుంచి వ్యతిరేకత, అభ్యంతరాలు రావడంతో తాత్కాలికంగా నిలిపివేయడం.. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారం కోల్పోవడంతో ఈ అంశం మరుగున పడింది. మళ్లీ ఈ అంశం తెరపైకి రావడం తో ఆందోళన నెలకొంది.
అన్యాయం జరిగితే ఊరుకోం
రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోం. తరతరాలుగా ఆ భూములనే నమ్ముకున్న రైతులకు పరిహా రం చెల్లించాలి. పాస్ పుస్తకా లు లేవనే సాకుతో వాళ్ల ఆధీనంలోని భూములు లాక్కోవ ద్దు. రైతుల డిమాండ్ మేరకు నష్ట పరిహారం చెల్లించాలి.
-శివారెడ్డి,
బీజేపీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్
ప్రభుత్వంపై బురద చల్లద్దు..
గత ప్రభుత్వ హయాంలో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం మా కాంగ్రెస్ పార్టీకి లేదు. టీఆ ర్ఎస్ హయాంలో 60 గజా లు ఇచ్చి రైతులను లోబర్చుకునే ప్రయత్నం జరిగింది.
-బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఏఐసీసీ టీవీవీ కోఆర్డినేటర్






