- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో మురుగు నీరు కలవడంపై హైడ్రా కమిషనర్ సీరియస్
మణికొండ మున్సిపల్ పరిధిలోని ముష్కి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,రాజేంద్రనగర్: మణికొండ మున్సిపల్ పరిధిలోని ముష్కి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చెరువులో మురుగు నీరు కలవడంపై ఆయన మండిపడ్డారు. చెరువు దగ్గర జరుగుతున్న విధ్వంసం పై స్థానికంగా నివాసం ఉంటున్న హాల్ మార్క్ విసినియా, అదేవిధంగా మై హోమ్ అవతార్ గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన పలువురు సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ధృవంశ్ అనే స్వచ్ఛంద సంస్థ తత్వా అనే రియల్ సంస్థ సౌజన్యంతో కొన్ని రోజులుగా చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా చెరువు అభివృద్ధి పేరుతో ముష్కి చెరువు పరిధిని బాగా తగ్గించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ముష్కి చెరువును మణికొండ మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో పరిశీలించారు. చెరువులో మురుగు నీరు ఎందుకు కలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా చెరువు సుమారు 52 ఎకరాల విస్తీర్ణం అయితే సుమారు 12 ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కట్టలు నిర్మించడాన్ని ఆయన తప్పు పట్టారు. అడ్డగోలుగా వ్యవహరించిన ధృవంశ్ సంస్థ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువులో మరుగు నీరు కలవకుండా ఏరియల్ సర్వే చేపిస్తామని ఆయన స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. మురుగు నీటి సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతోపాటు చెరువు ఎప్టీల్ పరిధిలో పోసిన మట్టి కుప్పులను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతా నిబంధనలో మేరకే వ్యవహరించాలని ఆయన సూచించారు. లేదంటే తాము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇరిగేషన్ శాఖ ఈ ఈ, ఏ ఈ, స్థానికులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






