- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
ఆ మహిళకు శోకమే మిగిలింది..

దిశ , కేశంపేట్ : విధి ఆడిన నాటకంలో ఓ మహిళకు శోకమే మిగిలింది. సాయం కోసం ఆశగా ఎదురుచూస్తుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని లింగంధన గ్రామంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన నాగిళ్ల యాదమ్మ ఇల్లు కూలిపోయింది. యాదమ్మది నిరుపేద కుటుంబం. తలకొండపల్లి గ్రామానికి చెందిన రాములుతో యాదమ్మకు వివాహం జరిగింది. 2013 వ సంవత్సరంలో రాములు అనారోగ్యంతో మృతి చెందాడు.
భర్త చనిపోయిన తరువాత సొంత గ్రామమైన లింగందనలో తండ్రి రామయ్య వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. సంవత్సరం క్రితం తండ్రి రామయ్య కూడా మృతి చెందడంతో యాదమ్మ ఒంటరైపోయింది. అకాల వర్షాలతో ఆదివారం ఆమె ఉంటున్న నివాసం కూడా కూలిపోయి నిరాశ్రయురాలు అయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా వేడుకుంటుంది. భర్తను, తండ్రిని, ఉన్న ఇంటిని కోల్పోయిన యాదమ్మ దీనస్థితిని చూసి గ్రామస్తులు చలించిపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందజేయాలని కోరుతున్నారు.