భారీ వర్షాలు..అతలాకుతలం!

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నా యి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో లోతట్టు ప్రాంతాలు జలమయం అ య్యాయి.

భారీ వర్షాలు..అతలాకుతలం!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నా యి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో లోతట్టు ప్రాంతాలు జలమయం అ య్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ప్రకటించగా.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిం చడంతో ప్రజానీకానికి వర్షం టెన్షన్‌ పట్టు కుంది. కుండపోత వర్షం కారణంగా ప్రజా నీకం ఇళ్లకే పరిమితమైంది. అధికార యం త్రాంగం కూడా అప్రమత్తమైంది. అధికారు లంతా హెడ్‌ క్వార్టర్స్​‍లో అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌‌తో పాటు అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

అతలాకుతలం..

పశ్చిమ- మధ్య, వాయువ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షా లు ముంచెత్తడంతో బుధవారం జిల్లా అతలాకుతలమైంది. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం స్కూళ్లకు ఆఫ్ డే ప్రకటించడంతో మధ్యాహ్నం విద్యార్థులం తా ఇళ్లకు చేరుకున్నారు. వరద ఉధృతి కా రణంగా కాలనీలు జలమయ్యాయి. ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరడంతో చాలా ప్రాం తాల్లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడి రాకపోకలు స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందు లు పడ్డారు. ఉద్యోగులతో పాటు వివిధ వృ త్తుల వారు సాయంత్రం ఇంటికి చేరుకునే సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ రద నీరు భారీగా హిమాయత్‌ సాగర్‌లోకి చేరుతుండడంతో అధికారులు మూడు గేట్ల ను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్ రహదారిని అధికారులు పూర్తిగా మూసి వేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు లో అంతర్జాతీయ విమానాలను రద్దు చేశా రు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చే పట్టేందుకు అధికారయంత్రాంగం సిద్దంగా ఉండాలని కలెక్టర్‌ సంబంధిత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా రు. కలెక్టరేట్‌‌లో కంట్రోల్‌ రూంలను ఏర్పా టు చేసి టోల్‌ ఫ్రీ నెంబర్‌ 7993103347, 040-23237416 లను అనౌన్స్ చేశారు. అన్ని తహశీల్దార్‌ కార్యాలయాలు, మున్సిప ల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏ ర్పాటు చేశారు. శిథిలావస్థలోని ఇండ్లను అధికారులు కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వికారాబాద్ జిల్లాలో..

వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువు లు, వివిధ ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. కొన్ని మండలాల్లో భారీ వర్షానికి పంటలు కొట్టుకుపోయి రై తులకు నష్టం ఏర్పడింది. 5వ తేదీ మంగళవారం నుంచి వర్షాలు ప్రారంభం అవగా, 9వ తారీకు శనివారం వరకు అప్పుడప్పుడు కాస్త విరామం ఇస్తూ జిల్లాలో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. కానీ 10వ తేదీ ఆదివారం నుంచి జిల్లాలో నాలు గు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నవాబ్ పేట్ మండలంలో అత్యధికంగా 200.8 మిల్లీ మీటర్ల వర్షపా తం నమోదవగా, కుల్కచర్ల మండలంలో అత్యల్పంగా 54.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలాఉంటే తెలంగాణ ప్రభు త్వం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను బుధవా రం ఆదేశించారు. జిల్లా ప్రజలు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకి వెళ్లకూడదని సూచించారు.

153.2 మి.మీ. వర్షపాతం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో జిల్లాలోని 27 మండలాల్లో సరాస రి వర్ష పాతం 153.2 మి.మీ. నమో దైంది. ఈ సీజన్‌లో 304.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వర కు 448.8 మి.మీ. వర్షం కురిసింది. ఆగస్ట్ లో 63.4 మి.మీ. సాధారణ వర్షపాతానికి అత్యధికంగా 153.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర ద నీరు పంట పొలాలను ముంచెత్తుతుండడంతో అక్కడక్కడా పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

Next Story