బ్రహ్మంగారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..

by Kodari Anjali |   (  Updated:2026-04-26 10:31:17  IST  )

ప్రసిద్ధ యోగి, కాలజ్ఞాన తత్త్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

బ్రహ్మంగారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..
X

దిశ, తాండూరు: ప్రసిద్ధ యోగి, కాలజ్ఞాన తత్త్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖాంజాపూర్ గేటు సమీపలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కడప జిల్లా కందిమల్లాయపల్లెలో నివసించిన బ్రహ్మంగారు భవిష్యత్తు పరిణామాలను తెలిపే 'కాలజ్ఞానం' రచించారాని తెలిపారు. కులమతాలకు అతీతంగా సమసమాజం కోసం బోధనలు చేస్తూ 1693లో సజీవ సమాధి పొందారాని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరు ప్రాంతంలో బ్రహ్మంగారి ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు.

అన్ని విధాల సహాయం అందిస్తాం..

అందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి వ్యక్తిగతంగా కూడా సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. జ్ఞానం, భక్తి, యోగం మార్గాల ద్వారా ప్రపంచానికి మంచి తెలిపిన బ్రహ్మంగారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ చారి, జయప్రసాద్, పులేందర్ చారి, యాదగిరిచారి, పాండురంగచారి, బాలకృష్ణచారి, వినోద్ కుమార్ చారి, రమేష్ చారి, లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.

Next Story