- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న గ్రీన్ ఫార్మసిటీ సీఐ బి. సత్యనారాయణ..
by Kodari Anjali |
మీర్‌ఖాన్‌పేట్ గ్రామ సమీపంలోని కంకర మిషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, బైక్‌పై ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి డివైడర్‌ను ఢీకొని స్పృహ కోల్పోయాడు.

X
దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ గ్రామ సమీపంలోని కంకర మిషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, బైక్‌పై ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి డివైడర్‌ను ఢీకొని స్పృహ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అయిన తలకు తీవ్ర గాయమైంది. కాగా వాహనదారుల వెంటనే ఫ్యూచర్ సీటీ కమిషనరేట్, గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ సీఐ బి. సత్యనారాయణకు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో అంబులెన్స్‌లోకి మార్చి, చికిత్స కోసం సమీప ఆసుపత్రికి పంపించారు. కాగా సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన సీఐ సేవలను స్థానికులు అభినందించారు.
Next Story






