పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

by Sridhar Babu |

జంలోని పేద ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే లక్ష్యంతోనే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఉమ్మడి మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
X

దిశ,తలకొండపల్లి : సమాజంలోని పేద ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే లక్ష్యంతోనే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఉమ్మడి మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందజేశారు. తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన చెన్న కేశవులుకు, పెద్దయ్య యాదవ్ కు, అమంగల్ లోని పత్య నాయక్, పోలేపల్లిలోని శ్రీను నాయక్ లకు మంజూరైన చెక్కులను తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ తో కలిసి అందజేశారు. అనంతరం తలకొండపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది సుభాష్ చంద్రబోస్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందడంతో మృదేహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు, ఆయా గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story