- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ
ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19,333 ఎకరాలను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకొని 8వేల ఎకరాలకు పైగా భూములను సేకరించింది.

దిశ, యాచారం : ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19,333 ఎకరాలను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకొని నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో 8వేల ఎకరాలకు పైగా భూములను సేకరించింది. 2200 ఎకరాల పట్టా భూములకు నోటిఫికేషన్ ఇవ్వగా భూములు ఇవ్వమబోని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో రాత్రికి రాత్రే రైతుల పేర్లు తొలగించి టీజీఐసీ పేరుమీద మార్చారు. నేటికీ రైతులు పోరాటాలను కొనసాగిస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూ కోర్టు ద్వారా తమ భూములను కాపాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది.
అందుకోసం 30 వేల ఎకరాలను సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద మండల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మొండి గౌరెల్లి గ్రామంలో 19, 68, 127, సర్వే నంబర్లలోని 821 ఎకరాల అసైన్డ్ భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామస్తులతో చర్చలు జరిపారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. మెజార్టీ రైతులు మెరుగైన పరిహారం ఇస్తేనే ఇస్తామని తెగేసి చెబుతున్నా రు. మూడు రోజులుగా ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో కొత్తపల్లి గ్రామంలోని 32, 178, 222, 182, 242 సర్వే నంబర్లలోని 1800 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు సర్వే చేస్తూ హద్దులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ భూముల అనంతరం నందివనపర్తి, సింగారం గ్రామాల పరిధిలో ఓంకారేశ్వర ఆలయం పేరు మీద ఉన్న 1400 ఎకరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల పరుగో పరుగు..
కొత్తపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న 32 సర్వే నంబర్‌లో ఆర్ఐ మురళీకృష్ణతోపాటు ఇబ్బంది సర్వే చేస్తుండగా చెట్ల పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళనకు గురైన సిబ్బంది పరుగులు తీశారు. ఎప్పటి నుంచో ఎలుగుబంటి తిరుగుతున్నట్లు తాము చూసిన ప్రాంతంలో ఆనవాళ్లు కనిపించినట్లు ఆర్ఐ తెలిపారు.






