Food Poison : విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్... హాస్టల్ వద్ద విపక్షాల ధర్నా

by Muthe.Rajitha |

వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్(Tribal Welfare Girls Hostel) లో మంగళవారం ఫుడ్ పాయిజన్(Food Poison) జరిగి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Food Poison : విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్... హాస్టల్ వద్ద విపక్షాల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్(Tribal Welfare Girls Hostel) లో మంగళవారం ఫుడ్ పాయిజన్(Food Poison) జరిగి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై హాస్టల్ వద్ద బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. వరుస సంఘటనలకు బాధ్యత వహిస్తూ సంభందిత మంత్రులతోపాటు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వద్ద, విద్యార్థినులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని అధికారులకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. ఈ ఘటనలపై ఇప్పటికే హైకోర్ట్(High Court) విచారణ చేపట్టి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.

Next Story