బాలాపూర్ లో అగ్ని ప్ర‌మాదం

by Nallavelli.Anjaneyulu |

అగ్ని ప్ర‌మాదంలో ప్లాస్టిక్ గోదాం, బేకరీ దగ్ధమైన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎ

బాలాపూర్ లో అగ్ని ప్ర‌మాదం
X

దిశ, మీర్ పేట్ : అగ్ని ప్ర‌మాదంలో ప్లాస్టిక్ గోదాం, బేకరీ దగ్ధమైన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గార్లెట్ కాలనీలో ప్లాస్టిక్ గోదాం లో ఉన్నట్టు ఉండి ఒక్క సారి మంటలు చెలరేగాయి. ప‌క్కనే ఉన్న బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ( అత్తార్ బేకరి ప్రొడక్షన్ )బేకరీ కి మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని సమాచారం అందుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చామని, బేకరి యజమాని ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story