విల్డర్న్ నెస్ క్యాంపుసైట్ లో అగ్ని ప్రమాదం..! కూలీలకు తీవ్ర గాయాలు..

by Disha Web Desk 11 |
విల్డర్న్ నెస్ క్యాంపుసైట్ లో అగ్ని ప్రమాదం..! కూలీలకు తీవ్ర గాయాలు..
X

దిశ ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ మండల పరిధిలోని సర్పంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న విల్డర్న్ నెస్ క్యాంపుసైట్ లో కొన్ని రసాయనాలు పేలి బ్లాస్ట్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ అగ్ని ప్రమాదంలో విల్డర్న్ నెస్ క్యాంపుసైట్ లో పనిచేసే అస్సాం రాష్ట్రానికి చెందిన పసంజీ, భగీరథ్ సింగ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాలని తెలుస్తుంది. మూడు రోజుల క్రితం ఈ బ్లాస్ట్ జరగగా బాధితులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కొంత విషమంగానే ఉందని తెలుస్తుంది.

శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు సర్పంపల్లి ప్రాజెక్ట్ దగ్గర గల విల్డర్న్ నెస్ క్యాంపుసైట్ లో పనిచేస్తామని, మూడురోజుల క్రితం జరిగినా అగ్ని ప్రమాదంలో గాయపడ్డామని మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదంపై సదురు రిసార్ట్స్ యాజమానిని వివరణ కోరగా, మా దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదని దాటవేసే ప్రయత్నం చేశారు.

Next Story

Most Viewed