- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..
మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన తలారి రేణమ్మ ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు.

దిశ, మొయినాబాద్ : మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన తలారి రేణమ్మ ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ రాంచెందర్ (రత్నం) మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయంగా రూ.10,000లను మృతురాలి భర్త తలారి చిన్న మరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా తలారి రేణమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గ్రామ మాజీ సర్పంచ్ రాంచెందర్ (రత్నం) మాట్లాడుతూ దేవుడు వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భావోద్వేగంతో పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని, మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపారు. మాజీ సర్పంచ్ అందించిన చేయూత పై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తలారి రాజు, తలారి పద్మారావు, అంతయ్య, సామయ్య, చంద్రమౌళి, శ్రీను, శేఖర్, కార్తీక్, కిరణ్, పేదింటి రాజు, శ్రీకాంత్, ప్రశాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






