సైకిల్ ట్రాక్ పై మహిళా రన్నర్ కు వేధింపులు

by Batti.Sumithra |   (  Updated:2026-04-27 09:13:50  IST  )

సైకిల్ ట్రాక్ పై ఓ దుండగుడు మహిళా రన్నర్ ను వేధించిన సంఘటన మై హోమ్ అవతార్ -నార్సింగి చౌరస్తా మార్గంలో జరిగింది.

సైకిల్ ట్రాక్ పై మహిళా రన్నర్ కు వేధింపులు
X

దిశ, గండిపేట : సైకిల్ ట్రాక్ పై ఓ దుండగుడు మహిళా రన్నర్ ను వేధించాడు. ఆమె వీడియో తీయగానే అతడు పారిపోయాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం మై హోమ్ అవతార్ -నార్సింగి చౌరస్తా మార్గంలో జరిగింది. తాను హైదరాబాద్ సురక్షితమే అనుకున్నాను.. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది ?" అని ఆమె ఓ సెల్ఫీ వీడియోలో ప్రశ్నించింది. తాను రన్నింగ్ చేస్తుండగా ఓ దుండగుడు తనతో అసభ్యకరంగా వ్యవహరించాడని వీడియో తీయగానే పారిపోయినట్లు ఆమె తెలియజేసింది. హైదరాబాద్ లో మహిళలకు రక్షణ లేదా అంటూ ఆమె పిల్లల చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన పై పోలీసులు ఇంకా స్పందించలేదు.

హైదరాబాద్‌ ‘సేఫ్ సిటీ’నా? సైకిల్ ట్రాక్‌పై యువతికి దారుణ అనుభవం! వీడియో వైరల్

Next Story