- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తికోసం తండ్రీ తనయుల పరస్పరదాడులు
తండ్రి పేరున ఉన్న ఆస్తిని తనపేరున మార్పిడి చేయాలని ఒత్తిడి చేస్తూ ఘర్షణకు దిగడంతో ఇరువురికి గాయాలైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్ : తండ్రి పేరున ఉన్న ఆస్తిని తనపేరున మార్చాలని ఒత్తిడి చేస్తూ ఘర్షణకు దిగడంతో ఇరువురికి గాయాలైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులేమాన్ నగర్ లో నివసించే ఖాలీమ్ (64), మతిన్ (42) తండ్రి కొడుకులు. సులేమాన్ నగర్లో ఉన్న ఇంటితో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్నఆస్తిని తనపేరున మార్చాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. గురువారం రాత్రి సైతం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
శుక్రవారం తెల్లవారుజామున కోపోద్రిక్తుడైన మతిన్ తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. తండ్రి మతిన్ పై ఖాలిం బండరాయితో దాడి చేశాడు. తలపై గాయాలైన ఖాలిం తిరిగి కొడుకుపై తిరగ బడ్డాడు. చేతికి అందిన సీసా ముక్కలతో మతిన్ గొంతుపై బలంగా పొడిచాడు. తండ్రి తనయులు ఘర్షణలతో రక్తసిక్తం కావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.






