యూరియా ఇస్తేనే ఇక్కడి నుంచి పోతాం

by velandi.Saikiran |

యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం ఎదుట యూరియా కోసం

యూరియా ఇస్తేనే ఇక్కడి నుంచి పోతాం
X

దిశ, పెద్దేముల్: యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం ఎదుట యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. రైతు సేవ సహకార సంఘం లోపలికి వెళ్లి తక్షణమే యూరియా బస్తాలను సరఫరాల చేయాలంటూ సిబ్బందితో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిన్న, మొన్న యూరియా తీసుకున్న రైతులకే మళ్లీ ఇస్తున్నారని... యూరియా అందని వారికి ఒక బస్తా కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి రైతులకు కావాల్సిన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యవసాయధికారి పవన్ ప్రితమ్, ఎస్ఐ వేణు కుమార్, రైతు సేవ సహకార సంఘం మేనేజర్ మురళీ రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో రైతుల ఆందోళన సద్దుమణిగింది.

Next Story