కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

by Ratna Kumari |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
X

దిశ, మాడ్గుల : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఆర్కపల్లి, చంద్రాయన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన ఉరుసు గంధం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ని యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు. అనంతరం ఆర్కపల్లి గ్రామంలో శంకర నేత్రాలయం ద్వారా ఎన్ఆర్ ఐ డాక్టర్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి ఆయన సేవలను ప్రశంసించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ బొజ్జ సాయి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు భాగ్యలక్ష్మి, రాధ, ఏఎంసి డైరెక్టర్ పల్లె జంగయ్య గౌడ్, నాయకులు సూదిని కొండల్ రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, లక్యా నాయక్, బాలు నాయక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story