శ్రీ రామాపురం హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Batti.Sumithra |

తాండూరు పట్టణ సమీపంలోని శ్రీ రామాపురం (రసూల్ పూర్) హనుమాన్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీ రామాపురం హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని శ్రీ రామాపురం (రసూల్ పూర్) హనుమాన్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీ హనుమాన్ మందిర్ నూతన పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ రాధాకృష్ణ బాబుతో పాటు పాలకవర్గ సభ్యులు దైవ సాక్షిగా తమ పదవికి న్యాయం చేస్తామని ప్రమాణం చేశారు. భక్తులకు ఎప్పుడు, ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామన్నారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

పోట్లీ మహారాజ్ కాంప్లెక్స్ పనుల పరిశీలన..

తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ ఆలయ ఆవరణలో జరుగుతున్న నూతన భవన నిర్మాణాల పనులను సోమవారం స్థానికులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ కాంప్లెక్స్ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి అయిన తర్వాత స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతిపనిలో పారదర్శకత పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికతో చక్కగా పనులు చేపట్టిన ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, పోట్లీ మహారాజ్ దేవాలయం చైర్మన్ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story