నార్సింగి లో డ్రగ్స్ కలకలం … టాలీవుడ్ యువ హీరో కి ఆమె ప్రేయసి...?

by Disha Web Desk 11 |
నార్సింగి లో డ్రగ్స్ కలకలం … టాలీవుడ్ యువ హీరో కి ఆమె ప్రేయసి...?
X

దిశ, గండిపేట్:- గండిపేట్ మండల శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారు. ప్రస్తుతానికి ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. టాలీవుడ్ హీరో కి ఆమె ప్రేయసి అని పోలీసులు నుంచి సమాచారం లీక్ కావడంతో అసలు ఆమె ఎవరు ? ఏ హీరోకి ఆమె ప్రేయసి అనే కోణంలో చర్చ జరుగుతుంది. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు హైదరాబాదులో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన దాని లింకులు టాలీవుడ్ పరిశ్రమకు లీడ్ అవుతూ ఉండేవి. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యను రిమాండ్‌కు తరలించారు.


Next Story