- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజశ్యామల ఆలయ భూముల జోలికి వెళ్లొద్దు: రామచందర్ రావు
కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో నిర్మితమవుతున్న విశాఖ శారదా పీఠం, రాజశ్యామల దేవాలయ భూములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది

దిశ, గండిపేట: కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో నిర్మితమవుతున్న విశాఖ శారదా పీఠం, రాజశ్యామల దేవాలయ భూములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతోందని, ఇదే నిజమైతే అది స్వాగతించదగ్గ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన నియో పోలీస్ లోని శారదా పీఠం సందర్శించారు. పీఠంలోని వేద పండితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ పేద విద్యార్థులకు ఉచితంగా వేద విద్యను బోధించే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు అప్పగించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించడం పై ఆయన మండిపడ్డారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. ప్రభుత్వం లౌకికవాదం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక, విద్యా కేంద్రాల పట్ల వివక్ష చూపడం తగదని ఆయన హితవు పలికారు.
ప్రజల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. ఈ ఉదయం మీడియా ముఖంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు రామచందర్ రావు తెలిపారు. "దేవాలయ భూముల జోలికి పోవద్దు, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు" అని చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. మతపరమైన కట్టడాలు మరియు విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించకూడదని ఆయన డిమాండ్ చేశారు.






