నకిలీ విత్తనాల నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం..

by Kodari Anjali |

రంగారెడ్డి జిల్లాలో నకిలీ (స్పూరియస్) విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడం కోసం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు.

నకిలీ విత్తనాల నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం..
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో నకిలీ (స్పూరియస్) విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడం కోసం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా ఉన్న “నకిలీ విత్తనాల రహిత రాష్ట్రం” సాధన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, సీడ్ కార్పొరేషన్లు (టీ ఎస్ ఎస్ డీ సీ /టీ ఎస్ ఎస్ ఓ సి ఏ), రవాణా శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో 3 జిల్లా స్థాయి బృందాలు, 6 డివిజనల్ స్థాయి బృందాలు, 26 మండల స్థాయి బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 474 రిటైల్ విత్తన దుకాణాలు, 9 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 224 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారు. ముఖ్యంగా పత్తి, మిర్చి పంటలలో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉన్నందున, సీజన్ మొత్తం కఠిన తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. నకిలీ విత్తనాలు అనగా లైసెన్సు లేని సంస్థలు తయారు చేసినవి, అనధికారికంగా విక్రయించబడినవి అని సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసినవి, తక్కువ నాణ్యత గలవి అని నిర్వచించబడింది.

నిందితులపై ఐపీసీ 420, ఈసీ యాక్ట్ 1955, సీడ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు

ఈ సమస్యను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా నిరంతర తనిఖీలు విత్తనాల నమూనాల సేకరణ, పరీక్షలు అలాగే రైతులకు అవగాహన కల్పించేందుకు లైసెన్సు ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి అనధికారిక విక్రేతల వద్ద కొనరాదు రైతు వేదికల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ సమావేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలపై కూడా చర్చించబడింది. ఈ విత్తనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించని జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలు కావడంతో వాటి సాగు చట్ట విరుద్ధమని, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. గ్లైఫోసేట్ వంటి రసాయనాల వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు. చివరిగా, నకిలీ విత్తనాల నిర్మూలనకు కఠిన చర్యలతో పాటు రైతుల సహకారం కూడా అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

Next Story