ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి

by Batti.Sumithra |

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, ఇబ్రహీంపట్నం : ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఈ మేరకు తుకుగూడ ఫ్యాబ్ సిటీ పరిధిలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ సీపీ జి.సుధీర్ బాబు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు పై, భవన నిర్మాణ ప్రక్రియ పై మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్ ప్రధాన కార్యాలయం కోసం ఒక తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేశామన్నారు. ఈ భవనం సెంట్రల్ లొకేషన్‌లో ఉండటంతో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పక్కన సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉండటం వల్ల రవాణా పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.

అలాగే మీర్ ఖాన్‌పేట్‌లో 24 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అక్కడ నూతన భవన నిర్మాణానికి ప్రాథమికంగా రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి, ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి కమిషనరేట్ కార్యకలాపాలను అక్కడికి తరలించనున్నాము. ప్రస్తుతం, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యకలాపాలన్నీ ఈ తాత్కాలిక కార్యాలయం నుంచే నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ జి.సుధీర్ బాబు, జాయింట్ సీపీ చందనా దీప్తి, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ, షాద్‌నగర్ డీసీపీ సిరీష, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, అదనపు డీసీపీ బి.వి. సత్యనారాయణ, ఏసీపీ హుస్సేన్ నాయుడు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, మహేశ్వరం ఏసీపీ ఎస్. జనకి రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ బి. కిషన్, ఏసీపీ అరుణ్ కుమార్, అలాగే కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్‌క్వార్టర్స్ ఆర్‌ఐలు తదితరులు హాజరయ్యారు.

Next Story