బీజేపీతోనే చేవెళ్ల అభివృద్ధి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీతోనే చేవెళ్ల అభివృద్ధి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గురువారం బంజారాహిల్స్​లోని తమ నివాసంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ... తాను ఎంపీగా ఉన్నప్పుడే అభివృద్ధి చేసిన పనులు నేడు నియోజకవర్గంలో దర్శనమిస్తున్నాయని కొండా వివరించారు. సుమారు రూ.200 కోట్ల నిధులతో నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. సర్పంచులకు నేరుగా నిధులు ఇప్పించడం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందాయి అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ స్కూల్ ని అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. తాను ఎంపీగా ఉన్న కాలంలోనే తాండూర్ రాయికి జీఎస్టీ ని 18 నుంచి 5 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. తాండూర్ కంది పప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో మొదటి సారి గళమెత్తింది తానేనని ఆయన చెప్పారు. తన పదవీకాలం అయిపోయాక తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా కోటిపల్లి డెవలప్ మెంట్ కు రూ.100 కోట్ల తీసుకు రాగలిగానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

త్వరలోనే శంకర్ పల్లి వరకు ఎంఎంటిఎస్ సర్వీస్ ల పొడిగింపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందన్నారు. పారిశ్రామిక బ్యాంకింగ్ రంగంలో నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు దేశ అభివృద్ధికి కీలకంగా మారాయని తెలిపారు. ఇవాళ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పిలవడానికి ఆ నిర్ణయాలే కారణమని కొండా చెప్పారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎప్పుడూ నష్టాల్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాలా లాభాల్లో నడుస్తున్నాయి ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంతో పనిచేస్తున్న తనకే చేవెళ్ల ప్రజలు పట్టం కడతారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయడం ద్వారా చేవెళ్ల ప్రజలు తనతోపాటు నరేంద్ర మోడీని కూడా ఆశీర్వదిస్తారని ఆయన చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చేవెళ్ల బిజెపి కన్వీనర్ కేఎస్ రత్నం, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed