- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక ఫిల్టర్ ల ధ్వంసం..
by Batti.Sumithra |
మండలంలోని చౌలపల్లి గ్రామ శివారు వాగులో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇసుక ఫిల్టర్ ల పై శుక్రవారం మండల రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

X
దిశ, కేశంపేట్ : మండలంలోని చౌలపల్లి గ్రామ శివారు వాగులో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇసుక ఫిల్టర్ ల పై శుక్రవారం మండల రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తహసీల్దార్ ఆజాం అలీ ఆదేశాల మేరకు ఆర్ఐ నివేదిత వాగు ప్రాంతాన్ని రెవెన్యూ సిబ్బంది సహాయంతో తనిఖీ చేశారు. ఐదు ఇసుక ఫిల్టర్లను గుర్తించి జేసీబీ సాయంతో ధ్వంసం చేయించారు.
వాగు ప్రవాహానికి అడ్డంగా వేసిన కట్టలను తొలగించారు. ఫిల్టర్ ల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, వాహనాలను స్వాధీనం చేసుకోలేదని ఆర్ఐ తెలిపారు. చౌలపల్లి, తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు ఇసుక ఫిల్టర్ లను ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు, ఫిల్టర్ల నిర్వహకుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
Next Story






