- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రీడేషన్ల ఘనత టీయూడబ్ల్యూజేదే : టీయుడబ్ల్యుజే నేత శ్రీకాంత్ రెడ్డి
దిశ, గండిపేట : అక్రిడేషన్ల ఘనత టీయూడబ్ల్యూజేదేనని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. మండలానికి ఒక అక్రీడేషన్

దిశ, గండిపేట : అక్రిడేషన్ల ఘనత టీయూడబ్ల్యూజేదేనని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. మండలానికి ఒక అక్రీడేషన్ కార్డుతో రంగారెడ్డి పరిధిలోని జీహెచ్ఎంసీలో పని చేస్తున్న జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మండలంతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాల్సిందేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, కార్యదర్శి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు నేతలు వెల్లడించారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ, కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర కోశాధికారి వెంకట్ రెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శివ శంకర్ గౌడ్, బాల్ రాజు తదితరులతో కలిసి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. గత రెండేళ్లుగా నూతన అక్రీడెషన్ కార్డులు జారీ చేయక పోవటంపై, ఇతర సమస్యలపై ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి, సమావేశం నిర్వహించి,అక్రీడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ విడుదల చేసిందని, ఇది టీయూడబ్ల్యూజే విజయం అని గుర్తు చేశారు. నూతన జీవో బాగుందని, అర్హులైన వారికి కార్డులు అందుతాయాన్నారు.
జీవో 252 ను సవరించాలని విజ్ఞప్తి
అక్రిడిటేషన్ ల కోసం నూతనంగా విడుదలైన జీవో 252 లో మండలానికి ఒక్క అక్రిడిటేషన్ నిబంధనతో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు ఆందోళకు గురికావాల్సిన అవసరం లేదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. నూతన జీవో లో మండలానికి ఒక్క కార్డు నిబంధన వల్ల గ్రేటర్ పరిధిలో అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, ఎల్ బీ నగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గాల్లో గతంలో కన్నా జర్నలిస్టుల కార్డులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై రంగారెడ్డి యూనిట్ లేవనేత్తిన అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ పేర్కొన్నారు. హెచ్ యూజె, మేడ్చల్, రంగారెడ్డి, జిల్లా ల ప్రతినిధుల బృందం ఈ మేరకు కలిసి వినతి పత్రం అందజేశారు. అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికలలో కనీసం నలుగురు నుంచి 6 మంది విలేకరులు పనిచేస్తున్నారని, ఒకటే కార్డు విధానం తో మిగిలిన వారికి నష్టం జరుగుతుందని వివరించారు. గతంలో మాదిరిగా పనిచేస్తూన్న వారికి కార్డులు వచ్చేలా జీవో ను సవరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందుకు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఇబ్బందులు తలేత్తకుండా చూస్తామని తెలిపారు. తన దృష్టికి వచ్చిన వాటిని పరిశీలించి ఖచ్చితంగా సవరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.






