- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం
కొడంగల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ నందారం ప్రశాంత్ ఎన్నికవగా వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ మెగావత్ శంకర్ నాయక్ ఎన్నికయ్యారు.

దిశ, కొడంగల్: కొడంగల్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా నాలుగో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నందారం ప్రశాంత్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఎనిమిదో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మెగావత్ శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయా వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎనముల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముందుగా కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌ను ఎన్నుకుని, తరువాత వైస్ చైర్మన్‌ను ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






