'అది చూసి ఓర్వలేకనే ఈ దొంగ దారిని ఎంచుకున్నారు'

by S Gopi |

షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.... Congress Protest at Shadnagar

అది చూసి ఓర్వలేకనే ఈ దొంగ దారిని ఎంచుకున్నారు
X

దిశ, షాద్ నగర్: షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మోహన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం, మోడీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువత అధ్యక్షుడు శివసేనా రెడ్డి, షాద్ నగర్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు హేయమైన నిర్ణయమన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో దేశంలో ఉన్న అన్ని వర్గాలకు, ప్రజలకు దగ్గరయ్యారనీ, ఇది చూసి ఓర్వలేకనే ఈ దొంగ దారిని ఎంచుకున్నారని అన్నారు.

Next Story