- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమనగల్లు పాలిటిక్స్... చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ!

చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ
ఉత్కంఠగా ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
కీలకం కానున్న ఎక్స్ అఫీషియా
దిశ, ఆమనగల్లు : ఆమనగల్ మున్సిపల్‌లో ఎక్స్ అఫీషియా ఓటర్లుగా పార్లమెంట్ సభ్యుడు మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నమోదు చేసుకున్నారు. దీంతో సోమవారం జరిగే మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీ 15 వార్డులు ఉండగా 8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 1 కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు గెలిచారు. మెజారిటీ ఒక అడుగు ముందంజలో బీఆర్ఎస్ ఉండగా, ఒక అడుగు దూరంలో బీజేపీ ఉండడంతో చైర్మన్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ ఒక కౌన్సిల్, పార్లమెంటు సభ్యుడు మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎక్స్ అఫీషియా ఓట్లతో వారి బలం 9కి చేరింది. బీఆర్ఎస్ బలం 8 స్థానాలే ఉన్నాయి.
చైర్మన్ కాంగ్రెస్, బీజేపీ వైస్ చైర్మన్..
నేడు ఉదయం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నది. చైర్మన్‌గా కోగూరు అనిత(కాంగ్రెస్), వైస్ చైర్మన్ తల్లోజు ఆచారి (బీజేపీ) ఎన్నిక లాంచనమే అని తెలుస్తుంది. ఏక్షణం ఏం జరుగుతుందోనని మున్సిపాలిటీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.






