- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు సరే.. నిబంధనలేవి?
మట్టి వ్యాపారం రంగారెడ్డి జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఎర్రమట్టి, బంకమట్టికి డిమాండ్ భారీగా ఉంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: మట్టి వ్యాపారం రంగారెడ్డి జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఎర్రమట్టి, బంకమట్టికి డిమాండ్ భారీగా ఉంది. రెవెన్యూ, మైనింగ్ అధికారులు కుమ్మక్కై మట్టి వ్యాపారంలో భాగస్వా మ్యం అవుతున్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి. అర్భన్ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకునేదారులకు ఎర్రమట్టి తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ట్రిప్పర్‌కు రూ. 10 వేల నుంచి రూే. 15 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. అదే విధం గా ఇటుక వ్యాపారులు గ్రామాల్లో ఉన్న చెరువులను అనాధికారికంగా స్థానిక ప్ర జాప్రతినిధులు, ప్రభావితం చేసే రాజకీ య నాయకుల సాయంతో తూతూ మం త్రంగా మైనింగ్ అనుమతి తీసుకున్నామ ని చెప్పి ఇష్టానుసారంగా నల్లరేగడి మట్టి ని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించి న ఆదాయంతో పోలిస్తే మట్టితో వ్యాపా రం చేసే వాళ్లు సంపాధించిందే అధికమనే ప్రచారం ఉంది. కానీ ప్రభుత్వానికి చెల్లించిన నగదు నిబంధనల ప్రకారం చెల్లించకుండా అధికారులతో కుమ్మక్కై చేతివాటాకు పాల్పడుతున్నారు. ఈ విధంగా అధికారులు, వ్యాపారులు చేసే పనులకు స్థానిక గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో సౌండ్ పొల్యూషన్, వాహనదారుల రాకపోకలతో ప్రమాదాలకు గు రౌతున్న ఘటనలు జిల్లాలో కనిపిస్తున్నా యి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏమీ తెలియదనే నల్లరేగడి మట్టి తరలించే వ్యాపా రులు రోజుకో దారి నుంచి ప్రయాణించడంపై అనుమానాలు వస్తున్నాయి.
అనుమతికి తరలింపుకు పోలికేది..
మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామ రెవె న్యూ పరిధిలోని సర్వే నెంబర్ 114లో 2హెక్టార్ స్థలం అన్నేపాక రామయ్య నల్లరేగడి మట్టిని తరలించేందుకు 4500 మేట్రిక్ టన్నులకు అనుమతి తీసుకున్నా రు. అందుకు రూ. 90వేల మైనింగ్ శాఖ కు చెల్లించినట్లు జిల్లా అధికారి ఎం నర్సి రెడ్డి పేరుతో ఓ అనుమతి పత్రం ఉంది. ఈ అనుమతికి తరలించే మట్టికి సంబం ధం లేదని స్థానిక గ్రామ ప్రజలు వివరిస్తు న్నారు. 4500 మెట్రిక్ టన్నుల మట్టిని 23 మే నుంచి 01, జూలై 1 వరకు తరలించుకోవచ్చు అని అధికారులు అనుమతినిచ్చారు. ఈ మట్టి తరలించేందుకు నిత్యం ఎన్ని వాహనాలు నడిపించాలి, ఎంత లోతు వరకు మట్టిని తొవ్వుకోవా లి, ఈ లెక్కలన్ని ఎవరు గమనిస్తున్నారనే విషయం పరిగణలోకి తీసుకోలేదు. అం తేకాకుండా ఏఏ గ్రామాల నుంచి ఈ వాహనాలు ప్రయాణించాలనే విషయా న్ని కచ్చితంగా నిబంధనల్లో పొందుపర్చాలి. కానీ ఇవేవీ లేకుండా మైనింగ్ ఇచ్చిన ఒక్క లేటర్‌ను అడ్డుపెట్టుకోని రో జుకు వందల వాహనాల్లో తరలించే వా హనాలు ఏ అధికారి లెక్కిస్తున్నారో తెలి యదు. అధికారికంగా మాత్రమే రూ. 90 వేల చెల్లించి, అనాధికారికంగా లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం సాగు తోంది. స్థానికంగా ఉండే అధికారులు కూడా పెద్దగా పట్టించుకునే పాపణ పోవ డం లేదని ఆరోపణలున్నాయి.
ఓవర్ లోడుకు జరిమానా లేదా..?
నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారులు ఇటుక బట్టిలకు తరలించే మట్టి వాహనాలతో దెబ్బతిన్నాయి. దీంతో రోడ్లు అన్ని గుంతల మయంగా మారిపోవడంతో టూవీలర్ వాహనాదారులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురైతున్నారు. ఓవర్ లోడుతో మట్టి తరలిస్తున్న వాహనాలపై నిఘా ఎందుకు పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో మైనింగ్ లేటర్ ఉందని ఆసరా చేసుకోని ఇష్టానుసారంగా మట్టి తరలిస్తే వదిలేయడంపై పలువురు అసహానం వ్యక్తం చేస్తు న్నారు. ఫిర్యాదులు చేసే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వివరిస్తున్నారు.+
నిత్యం వందల లారీలతో రాకపోకలు..
వందల లారీలతో రాత్రి పగలు తేడా లేకుం డా ఇష్టానుసారంగా నల్లరేగడి మట్టి తరలిస్తున్నారు. మాడ్గుల మండ లం గిరికొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని నర్సంపల్లి చెరువు నుంచి ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇటుకబట్టిలకు మట్టి తరలిస్తున్నారు. ఈ తరలింపుతో ఆ గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపల్లి నుంచి వయా ఆర్కపల్లి, బ్రహ్మాణపల్లి, మాడ్గు ల, నర్సాయిపల్లి, కొలుకులపల్లి మీదు గా సాగర్ హైవే రోడ్డుకు కొన్ని టిప్ప ర్లు.. ఆర్కపల్లి, సుద్దపల్లి, సాగర్ హైవే పైకి మరికొన్ని ట్రిప్పర్లు ఉదయం సమయంలో ఇరుకు రహదారుల్లో ప్ర యాణిస్తున్నాయి. మైనింగ్ ఇచ్చిన అనుమతిలో ఒక రూట్ మ్యాప్ లేకపోవడం పై గమానర్హం. అంతేకాకుం డా ఈ రహదారుల్లో ఉదయం, సా యంత్రం అనే తేడా లేకుండా ట్రాఫీక్తో ఇబ్బం దులు పడుతున్నారు. కార్లు, బైకులు ఒకే సారి రాకపోకలు జరిగే పరిస్థితి లేదని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






