స్నేహితుడి కుటుంబానికి బాసటగా నిలిచిన 10వ తరగతి క్లాస్‌మేట్స్

by Kodari Anjali |

అనారోగ్యం బాలేక మరణించిన స్నేహితుడి కుటుంబానికి పదవ తరగతి మిత్రులు రూ. 1 లక్ష సాయం చేశారు.

స్నేహితుడి కుటుంబానికి బాసటగా నిలిచిన 10వ తరగతి క్లాస్‌మేట్స్
X

దిశ, తలకొండపల్లి: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న సుమారు 80 మంది విద్యార్థులు తోటి స్నేహితుడు మారమోని నరసింహ అనే క్లాస్‌మేట్స్ గత పది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించాడు. విషయం తెలుసుకున్న తోటి మిత్రులందరికీ ఆదివారం తమ ఇంటికి చేరుకొని అతని భార్యా పిల్లలకు ధైర్యం కల్పించి, పిల్లల చదువు నిమిత్తం ఒక లక్ష రూపాయలను విరాళంగా అందించారు. మృతుడు నరసింహకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇకముందు కూడా నరసింహ కుటుంబానికి బాసటగా నిలిచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తోటి క్లాస్‌మేట్స్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హేమారాజు, పిఈటి పాండు, డాక్టర్ సత్యం, లైన్మెన్ బాల్నారి, హరిలాల్, శ్రీను, గిరిధర్ రెడ్డి, యాదయ్య, భాష తదితరులు పాల్గొన్నారు.

Next Story