పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ

by Malleboina Mahesh |

మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య నెలకొన్న ఘర్షణ కాస్త దాడులు, ప్రతి దాడులకు దిగారు. ఈ షాకింగ్ ఘటన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, మాదారం పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. పోలింగ్ బూతులో కూర్చోవాల్సిన ఏజెంట్లే.. తమకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాట మాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య వివాదంగా చోటు చేసుకొని తోపులాట జరిగి, దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్చలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Next Story