- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టు..!
యాలాల మండలంలో ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించగా సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.

దిశ, తాండూర్ రూరల్: యాలాల మండలంలో ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించగా సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. గోవిందరావుపేట శివారు వ్యవసాయ పొలంలో ఉన్న కాశీకి చెందిన జైశ్రీరామ్ గిరి అనే సాధువు తన అక్కతో కలిసి జీవిస్తున్న ఆశ్రమంపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 36 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ సీఐ పరమేశ్వర్, ఎక్సైజ్ ఎస్సై నిజాముద్దీన్, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు పాల్గొని సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని, ఆశ్రమంలో గంజాయి సాగు ఎలా జరిగింది? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.






