రైతును రాజు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Disha Web Desk 11 |
రైతును రాజు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్: రైతును రాజు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మల్కారం సర్పంచ్ మాధవి యాదగిరి రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో రైతు వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు శంషాబాద్ మండల బీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు యాదగిరి రెడ్డి నాగలిని బహుకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను సుఖసంతోషాలతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు అవహేళన చేసిన రైతులకు 24 గంటలు ఉచిత కరెంటుతో పాటు పెట్టుబడి సాయం కింద రైతుబంధు రైతు అకారణంగా మరణిస్తే 5 లక్షల రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు ప్రభుత్వమని చాటిచెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వేసవి కాలం వస్తే పట్టణాలతో పాటు గ్రామాలలో తాగునీరు కొరకు ఎంతో ఆందోళనలు జరిగేవని వాటి అన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించి కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి అందజేసి తాగునీరు సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కరించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,పిఎసిఎస్ చైర్మెన్ బుర్కుంట సతీష్, రైతు సంఘం మండల అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, సర్పంచులు మాధవి యాదగిరి రెడ్డి, దండు ఇస్తారి, దేవిక జగన్ గౌడ్,రమేష్, కల్పన, రాంగోపాల్, నాయకులు రాజశేఖర్ గౌడ్, మోహన్ రావు,జంగయ్య, నీరటీ రాజు, శ్రీనివాస్, శ్రీశైలం, ప్రభు సాగర్, రాజశేఖర్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed