చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 25 మందిపై కేసు నమోదు?

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-06 05:04:37  IST  )

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకరను తరలిస్తున్న టిప్పర్ తాండూరు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 25 మందిపై కేసు నమోదు?
X

దిశ, తాండూరు టౌన్: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకరను తరలిస్తున్న టిప్పర్ తాండూరు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందిన విషయం విధితమే. చేవెళ్ల రోడ్డు ప్రమాదం జరిగిన మరుసటి రోజే తాండూర్ డెవలప్మెంట్ ఫోరం పిలుపుమేరకు ప్రజా సంఘ నాయకులు, విద్యావంతులు తాండూర్ పట్టణ యువకులు "సేవ్ తాండూర్"అంటూ తాండూర్ పట్టణంలోని విలేమున్ చౌరస్తాలో తాండూర్ నుంచి హైదరాబాద్ రోడ్డు విస్తరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి స్థానిక పాలకులే ప్రధాన కారకులంటూ నిరసన చేపట్టారు. కాగా, నిరసనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదంటూ, సామాన్య ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు నిరసనకారులు అడ్డగించారని , నిరసనలో పాల్గొన్న 25 మంది పై తాండూర్ పట్టణ పోలీస్ శాఖ కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Next Story