- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూతగాదాలతో తమ్ముడి కుటుంబం పై అన్న కుటుంబం దాడి.. తీవ్ర గాయాలు
భూముల పంచాయతీ అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజేసింది.

దిశ, దుద్యాల: భూముల పంచాయతీ అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజేసింది. తమ్ముడి కుటుంబంపై అన్న కుటుంబం దాడి చేసిన ఘటన దుద్యాల మండలంలోని నాన్యనాయక్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భీమ్లానాయక్, రాంచందర్ అన్నదమ్ములు. పెద్దల నుంచి వచ్చిన భూమిని ఇద్దరం సగం సగం చేసుకుందామని, తమ్ముడు రాంచందర్, అన్న భీమ్లా నాయక్‌ను కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాడు. రామచందర్‌కు నలుగురు కూతుర్లు ఉండడంతో, దీనికి భీమ్లా నాయక్ నీకు అందరు ఆడపిల్లలే ఉన్నారు కదా, నాకు ఎక్కువ భూమి ఇవ్వాలని తమ్ముడు రాంచందర్‌ను కోరుతుండడంతో, తరచూ గొడవలు జరుగుతున్నాయి.
పెద్దల నుంచి వచ్చిన భూమిని చెరిసగం సమానంగా పంచుకుందామని రాంచందర్ చెప్పాడు. దీంతో ఇద్దరు తరుచూ గొడవ పడేవారు. ఇదివరకే ఇద్దరి పై రెండు కేసులు నమోదయ్యాయి. శనివారం రోజు రాంచందర్ చింత చెట్టు నుంచి చింతకాయలు తీస్తుండగా, అది నాది, నన్ను అడగకుండా ఎలా తీస్తావని భీమ్లా నాయక్ అడగడంతో, మాట మాట పెరిగి, రాంచందర్ కుటుంబం పై, భీమ్లా నాయక్ కుటుంబం దాడి చేయడంతో, రాంచందర్ కూతురు భారతికి తల పగిలి, తీవ్ర రక్తస్రావం జరిగింది. రాంచందర్ కాళ్లకు గాయాలు కాగా, భార్య దేవులిబాయికి చేతికి గాయాలయ్యాయి. గమనించిన తండావాసులు వారిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వీరు దుద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకొని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు.






